వైయస్‌ జగన్‌ను కలిసిన కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌

ప్రకాశం: సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ని రెగ్యూలరైజ్‌ చేస్తామని పెట్టిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బతుకులతో ఆడుకుంటుందని వారంతా వైయస్‌ జగన్‌తో మొరపెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ కలిశారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని 35 రోజుల పాటు నిరాహారదీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దీక్ష విరమింపజేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసి మమ్మల్ని ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. 
 
Back to Top