వైయస్సార్సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు

హైదరాబాద్ః  టీడీపీ, కాంగ్రెస్  పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉపందుకున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమక్షంలో ఆయా జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల నేతలు  వైయస్సార్సీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో  పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎన్ఎస్ యూఐ రాష్ట్ర నాయకుడు కొండా రాజీవ్ గాంధీ... కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ జిల్లా  వైయస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు నేతృత్వంలో వైయస్ జగన్ ను కలిసి పార్టీలో చేరారు.

లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లాకు చెందిన వాల్మీకి నేతలు రాప్తాడు బలరాముడు నేతృత్వంలో వైయస్ జగన్ ను కలిశారు. టీడీపీ దౌర్జన్యాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో...రామగిరి టీడీపీ నేత మీనుగ నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్రాముడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా వైయస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 
Back to Top