హైదరాబాద్)) రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొదటి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్ర కెక్కారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ సింధూకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.<br/>రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకొన్న పివీ సింధుకి హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం చారిత్రాకం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో క్రీడా రంగంలో మంచి మార్పులకు, మరెన్నో విజయాలకు నాంది పలికే అద్భుతమైన, స్ఫూర్తివతమైన విజయం అని వైయస్ జగన్ అభిలషించారు. అటు సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో కూడా వైయస్ జగన్ ట్వీట్ చేశారు. <br/>