రైతు కుటుంబాల్లో భరోసా

రెండోరోజు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర
తొలిరోజు నాలుగు కుటుంబాలకు భరోసా
నేడు మరో మూడు కుటుంబాలకు పరామర్శ
సమస్యలు జననేతకు ఏకరవు పెట్టిన రైతులు, మహిళలు
టీడీపీ మోసపూరిత పాలనపై మండిపాటు

అనంతపురంః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన జననేతను రైతులు,మహిళలు ప్రతిఒక్కరూ కలుకుకొని... టీడీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయాన్ని ఏకరవు పెట్టారు. తొలిరోజు వైయస్ జగన్ రాక సందర్భంగా  పెద్దవడుగూరు జనసంద్రమైంది. తమ అభిమాననేతను చూసేందుకు తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. 

పెద్దవడుగూరుతో పాటు వైయస్ జగన్‌యాత్ర సాగిన ప్రతీపల్లెలోనూ మహిళలు అభిమానహారతి పట్టారు. నుదుట విజయతిలకం దిద్దారు. యువకులు పూలవర్షం కురిపించారు. పల్లె ప్రజల అభిమానానికి వైయస్ జగన్ తడిసిముద్దయ్యారు. వైయస్ జగన్ వెంట జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వీఆర్‌రామిరెడ్డి, రమేశ్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డిలు ఉన్నారు. 

పెద్దవడుగూరులో రచ్చబండ వద్ద రైతులు, డ్వాక్రా మహిళల సమస్యలపై వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం వల్ల తామెలా నష్టపోయామో రైతులు, మహిళలు వైయస్ జగన్‌తో ఏకరువు పెట్టారు. మరోసారి చంద్రబాబు ప్రభుత్వానికి ఓటేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తర్వాత దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి చిన్నవడుగూరు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న నాగసంజీవప్ప కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడి నుంచి దిమ్మగుడి చేరుకున్నారు. అక్కడ వైయస్ జగన్‌పై పూలవర్షం కురిపించారు. బ్యాండ్, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. మహిళలు దిష్టితీసి హారతి పట్టారు.

అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు నాగార్జునరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించారు. అక్కడి నుంచి కండ్లగూడూరు చేరుకున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరినీ వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం అక్కడి నుంచి ఆయన చింతలచెరువు చేరుకున్నారు. అక్కడ కూడా దారిపొడవునా ఆయనపై పూలవర్షం కురిపించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న వెంకటనారాయణరెడ్డి, జగదీశ్వరరెడ్డి కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. తర్వాత అక్కడి నుంచి తెలికి చేరుకున్నారు. రాత్రి 9గంటల సమయంలో కూడా వైయస్ జగన్‌ను చూసేందుకు రైతులతో పాటు వృద్ధులు, మహిళలు రోడ్డుపై వేచి ఉన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు.

అటు నుంచి మేడిమాకులపల్లి చేరుకుని జెడ్పీటీసీ సభ్యుడు చిదంబరరెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు. మొదటిరోజు యాత్రలో నియోజకవర్గ సమన్వయ కర్తలు, నాయకులు తిప్పేస్వామి, ఆలూరు సాంబశివారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బోయ సుశీలమ్మ, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మీసాలరంగన్న, నదీమ్ అహ్మద్, కొర్రపాడు హుస్సేన్‌పీరా, జయరాంనాయక్, రవీంద్రనాథరెడ్డి, విఘ్నేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
నేటి యాత్ర ఇలా..
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర  రెండో రోజు పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి ప్రారంభమైంది. లక్షుంపల్లి, ముప్పాలగుత్తి, బుర్నాకుంట, కదరగుట్టపల్లి మీదుగా కిష్టిపాడు చేరుకుని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని వైయస్ జగన్  పరామర్శిస్తారు. తర్వాత రాయలచెరువు మీదుగా నగరూరు చేరుకుంటారు. కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు భరోసా ఇస్తారు.
 
Back to Top