మద్దతు ధర కోసం ఆందోళన

అనంతపురం జిల్లా: మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించాలంటూ అనంతపురం జిల్లా విడపనకల్ లో వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మిర్చి రైతు పట్ల ప్రభుత్వ వైఖరిని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ప్రజలతో పాటు భోజనాలు చేశారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మద్ధతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రూ. 5 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు అది ఏమైందని ప్రశ్నించారు. మిర్చికి మద్దతు ధర కోసం అసెంబ్లీలో వైయస్‌ జగన్ ప్రస్తావిస్తే ప్రభుత్వం కనీసం చర్చకు కూడా రాలేదని పేర్కొన్నారు. రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి దుర్భరమైన జీవనం సాగిస్తున్నా చంద్రబాబు కంటికి కనిపించక పోవడం దారుణమన్నారు.
Back to Top