తమను టీడీపీ ఎమ్మెల్యే చంపేస్తారంటూ ఫిర్యాదు


 ఒంగోలు తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై హైదరాబాద్ లోని మానవహక్కుల సంఘం లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్యే కారణంగా తనకు ప్రాణహాని ఉందంటూ దామచర్లకు చెందిన ముస్లిం జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.ముస్లిం సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలపై ఉద్యమించినందుకు తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని షేక్ మహమ్మద్ ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన హెచ్చార్సీ ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 19లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఒంగోలు ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. 
 

Back to Top