హైదరాబాద్) ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నది ప్రతిపక్షనేతవైఎస్ జగన్ ఒక్కరే. ఆయన సారధ్యంలోని వైఎస్సార్సీపీ అనేక దశల్లో లక్ష్యం దిశగా ఉద్యమిస్తూ వస్తోంది. ఏడాదిన్నర కాలంలో వైఎస్సార్‌సీపీ సాగించిన పోరాట క్రమమిదీ... ► 19 మే 2014: ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లో కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి సహకరించాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు.► 12 జూన్: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి కనీసం 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.► 5 డిసెంబర్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు.► 31 జనవరి 2015: డిమాండ్ల సాధనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో రెండ్రోజుల పాటు జగన్ దీక్ష చేశారు.►15 ఫిబ్రవరి: ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను కలిసి విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు.►16 మార్చి: లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా కల్పించాలని పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.►30 మార్చి: ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని, కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు►31 మార్చి: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్ నేతృత్వంలోని బృందం విన్నవించింది.► 12 ఏప్రిల్: హోదా కోరుతూ పార్లమెంట్‌లోనూ, పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీల ఆందోళన.► 15 ఏప్రిల్: జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని హామీ ఇచ్చిన దరిమిలా పోలవరం ప్రాజెక్టును తక్షణం చేపట్టి పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ప్రాజెక్టు సందర్శన (మూడు రోజుల యాత్ర)► 3 జూన్-4 జూన్: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన తీరుపై, ప్రత్యేక హోదా సాధించలేక పోవడంపై మంగళగిరి వద్ద రెండు రోజులపాటు జగన్ సమరదీక్ష.► 9 జూన్: రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఎంతో కీలకమైన పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా కల్పించేలా చూడాలని జగన్ నేతృ త్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి విన్నవించింది.► 11 జూన్: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి జైట్లీలను కలిసి మరోసారి ఒత్తిడి.► 10 ఆగస్టు: ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్న కాలయాపనకు నిరసనగా, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల విషయాన్ని జాతీయస్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా ఢిల్లీలో జగన్, పార్టీ నేతల ధర్నా. ర్యాలీగా పార్లమెంట్‌కు వెళుతుండగా జగన్‌తో సహా నేతల అరెస్ట్.► 29 ఆగస్టు: హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విజయవంతంగా రాష్ట్ర బంద్.► 1 సెప్టెంబర్: హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం కోసం పట్టుబట్టడం. చివరకు తీర్మానం చేయించడం.►15 సెప్టెంబర్: ప్రత్యేక హోదా ప్రజల ఆకాంక్ష, ఆవశ్యకత, పోరాటాలపై తిరుపతిలో నిర్వహించిన యువభేరి నుంచి జగన్ ప్రసంగం. ►22 సెప్టెంబర్: హోదా సాధించే దిశగా విశాఖలో నిర్వహించిన యువభేరి నుంచి జగన్ దిశానిర్దేశం. అదే సమయంలో ఏపీ ప్రజల హక్కు అయిన హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన.