వైయస్సార్సీపీలో చేరిన చోడవరం టీడీపీ నేతలు

బుచ్చెయ్యపేట: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పోరాటాల‌కు ఆక‌ర్షితుల‌వుతున్న వివిధ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు వ‌ర‌స‌లు క‌డుతున్నారు. విశాఖ జిల్లా చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం బుచ్చెయ్య‌పేట మండ‌లం గొర్లెపాలెం గ్రామానికి చెందిన 270 మంది టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ధ‌ర్మ‌శ్రీ వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చకపోవడంతో విసుగుచెంది ఆ పార్టీలో ఇమడలేక వైయ‌స్సార్ సీపీలో చేరుతున్నామ‌ని వారు చెప్పారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు కుంచం ప్రకాషరావు,బోయిన నారాయణమూర్తి,డేగల అచ్చింనాయుడు,దాసరి అప్పలనాయుడు,వెలుగుల శ్రీనివాస్,ఇందలి సూర్యనారాయణ,అట్టా శ్రీను, రావి శ్రీను,ఇందలి చినబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top