పథకం ప్రకారమే ప్రతిపక్షంపై కేసులు

తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ నీచరాజకీయాలపై మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో సీఎం చంద్రబాబు ఒత్తిడి వల్లే తమపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top