చుక్కలు చూపిస్తున్న చంద్రబాబుడీఎస్సీ అభ్యర్థులకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో డీఎస్సీ సమస్యపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని  ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహం
ఎదుట డీఎస్సీ అభ్యర్థులు నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. ఇప్పటివరకు ఏ
ఒక్కరికి ఉద్యోగం రాలేదని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులపై దాడి చేయడం
దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలు గుండాల్లాగా రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top