దయనీయంగా ఖాదీ కార్మికుల బతుకులు

నేత కార్మికుల కష్టాలను తెలుసుకున్న జననేత..
శ్రీకాకుళంః విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ కార్మికుల బతుకులు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాయి.  ప్రోత్సహం కరువై, ఆదుకునే వారు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  పొందూరు వెళ్ళిన వైయస్‌ జగన్‌ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముడిసరుకులు ధరలు పెరిగిపోయాయని ఖాదీ కార్మికులు జగన్‌తో చెప్పుకున్నారు.ముడి సరుకులకు రాయితీ ఇప్పించాలని  కార్మికులు కోరారు. కూలీ కూడా గిట్టుబాటు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాదీ,చేనేతకు చేయూతనివ్వాలన్నారు.కార్మికులకు హౌసింగ్, వెద్య సాయం కల్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు  ఖాదీపై రిబేట్‌ ఇస్తున్నాయన్నారు.ప్రభుత్వం కూడా రాయితీ కల్పించాలన్నారు. ఖాదీ మనుగడ కష్టమవుతుందని, యువత ఇటువైపు రావడంలేదన్నారు. వయస్సు పైబడిన వారు మాత్రమే ఖాదీని నేస్తున్నారన్నారు. ప్రత్యేక ఫ్యాకేజీలు ఇచ్చి  ఆదుకోవాలన్నారు.చేనేతలు,ఖాదీల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని, నేత కార్మికులకు రెండువేలు  అందజేస్తామన్నారు. కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.నవరత్నాలతో అందరికి మేలు జరుగుతుందని మరోసారి జననేత భరోసా ఇచ్చారు.జననేత హామీ పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top