వైయస్సార్సీపీ నేతల అరెస్ట్.. ధర్మవరంలో ఉద్రిక్తత

అనంతపురంః ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. చేనేత సదస్సును వైయస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు. నేతన్నలకు రుణమాఫీ ఎందుకు చేయలేదని, బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. చేనేత కార్మికుల పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి స్వాహా పలువురు చేనేత కార్మికులు అరెస్ట్ అయ్యారు.

Back to Top