హైదరాబాద్) మోసం చేయటంలో చంద్రబాబు ని మించిన వారు కనిపించరు. డ్వాక్రా మహిళల్ని ముప్పు తిప్పలు పెట్టడంలో బాబు కొత్త మార్గాల్ని అవలంబిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో ఊదర గొట్టారు. ప్రతీ ప్రచార సభలోనూ అదే పనిగా హామీలు గుప్పించారు. తెలుగుదేశం నాయకులైతే ఊరూరా పోస్టర్లు అతికించి మరీ ప్రచారం చేశారు. ఆయన వస్తే అప్పులన్నీ తీరిపోతాయి. అప్పటిదాకా అప్పుల్ని తిరిగి కట్టవద్దని ఊదర గొట్టారు. కొన్ని సంవత్సరాలుగా డ్వాక్రామహిళలకు రాయితీ ద్వారా రుణాలు అందుతుండేవి. వీటి సాయంతో వేలాది సంఘాలు ఆర్థికంగా స్వావలంబన సాధించాయి. కానీ, చంద్రబాబు అండ్ గ్యాంగ్ చేస్తున్న ప్రచారంతో ఈ మహిళా సంఘాలు రుణాలు కట్టడం మానేశాయి.ఫలితంగా మహిళాసంఘాలు బ్యాంకుల అప్పులు తీర్చలేక రుణాల ఊబిలో కూరుకొని పోయాయి. చివరకు ఆర్థిక స్వావలంబన మాట దేవుడెరుగు.. కనీసం ఖర్చులకు కూడా చేతిలో డబ్బులేని పరిస్థితి. మొత్తంగా మహిళా స్వావలంబన ను కూకటి వేళ్లతో సహా పెకలించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఈ పరిస్థితిని గమనించి బాధ్యత గత ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సమర దీక్షకు సమాయత్తం అయ్యారు. అప్పుడు హడావుడిగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళా సంఘాలకు పది వేల రూపాయిల చొప్పున ఇస్తామని చెప్పి చివరకు రూ.3వేల చొప్పున విడుదల చేశారు. పోనీ ఈ మొత్తం అయినా చివరకు చేరకుండా సవాలాక్ష నిబంధనలు అడ్డు పడుతున్నాయి. వీటిని సంఘం పరిపుష్టి కోసం వినియోగించుకోవాలని, మరొకటి అని కారణాలు చెబుతున్నారు తప్పితే సభ్యుల నిజమైన అవసరాలకు పనికి రావటం లేదు. కొన్ని చోట్ల అయితే బ్యాంకులు పాత బకాయిల కోసం ఈ రూ.3వేల ను కూడా ఆపుతున్నాయి. మహిళల్నిముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న చంద్రబాబు .. సింగపూర్ కంపెనీల కోసం పరుగులు పెట్టించి మరీపనులు చేయిస్తున్నారు.