చంద్రబాబూ... ? ఎందుకీ బీద అరుపులు?

  • ఉద్యోగుల పిఆర్‌సీ ఎగ్గొట్టేందుకు కొత్త నాటకమా?
  • 8 లక్షలమందికి నిరాశ కలిగిస్తున్న బాబు విధానం
  • లోటు బడ్జెట్ అంటూ కొత్త పాట మొదలు పెట్టిన వైనం
  • మరోవైపు మిగులు బడ్జెట్ అంటూ ప్రకటనలు విడుదల
  • తన విలాసాలకు గుర్తుకురాని రాష్ట్ర ఖజానా


  • హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలాది కంపెనీలు మూసి... వేసి వేలాది మంది కార్మికులను రోడ్డున పడేసి ప్రపంచబ్యాంకు చేత శభాష్..! అనిపించుకున్న చంద్రబాబు.. ఉద్యోగుల విషయంలో తన తీరు ఏమాత్రం మారలేదని మరోసారి నిరూపించుకున్నారు.  వచ్చీ రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పీకి పారేసిన బాబు గారు అంతటితో ఆగలేదు. లక్షలాది రేషన్‌కార్డులు, పేదల ఇళ్లు, వితంతు, వికలాంగ పింఛన్లు ఆపేసి తనకు తానే జబ్బలు చరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా తాజాగా ప్రభుత్వ  ఉద్యోగుల పీఆర్‌సీకి ఎసరు పెట్టాడు. లోటు బడ్జెట్ సాకుతో ఏకంగా ఎగ్గొట్టేందుకు పావులు కదుపుతున్నాడు. విచిత్రమేంటంటే సంక్రాంతి పండక్కి చంద్రన్న కానుక పేరిట సొంత కంపెనీ హెరిటేజ్‌కు నెయ్యి కాంట్రాక్టులు ఇప్పించుకుని ఖజానాకు రూ.26 కోట్లు కన్నం పెట్టినపుడు చంద్రబాబుకు రాష్ట్ర ఖజానాలో ఉంది ప్రజల సొమ్ము అని గుర్తుకు రాలేదు.
    రాజధాని నిర్మాణం పేరుతో సొంత విమానంలో విదేశీ పర్యటనలు చేసినపుడు ఆయనకు ఖజానాలో ఉందని ప్రజల సొమ్మని గుర్తుకురాలేదు.
    రాజధాని నిర్మాణం కోసం విదేశీ సంస్థల వందల కోట్ల భూమి అప్పనంగా అందజేయాలని ప్రయత్నించినపుడు రాష్ట్ర ఖజానాకు గుర్తుకు రాలేదు..
    రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగుల పీఆర్‌సీ విషయంలోనే ఆయనకు రాష్ట్ర ఖజానా గుర్తుకురావడం శోఛనీయం.

    అంతా వ్యూహాత్మకంగానే...!

     ఏకంగా 8 లక్షల మంది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వారి డిమాండ్ మేరకు పీఆర్‌సీని పెంచకుండా ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రం రూ. 16 వేల కోట్ల లోటు బడ్టెట్‌లో ఉందని, ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు రోజూ బీద అరుపులు అరుస్తున్నాడు. తన విలాసాలకుగానీ, తాత్కాలిక కార్యాలయాల మరమ్మత్తులకుగానీ, సింగపూర్, జపాన్, దావోస్ టూర్లకు గానీ కోట్లకు కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు- ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన ఫిట్‌మెంట్ (మూల వేతనంలో పెంపు) పెంచాల్సి వచ్చేసరికి జీతాలకే డబ్బుల్లేవు.... అంటూ సరికొత్త మైండ్‌గేమ్ ప్రారంభించారు.

    వాస్తవాలు ఏం చెబుతున్నాయి?
    వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే.. తెలుగుదేశం పార్టీ అధికార గెజిట్ పత్రిక అయిన ఈనాడులో వచ్చిన కథనాన్ని బట్టే- ఆదాయం రూ. 78,250 కోట్లు ఉంటే, వ్యయం రూ. 77,875 కోట్లు ఉంది. అంటే 375 కోట్లు మిగులు బడ్జెట్ ఉందన్న మాట. పైగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక- మొత్తం 43 లక్షల పెన్షన్లలో 10 లక్షల పెన్షన్లను తొలగించారు. అలానే దాదాపు 23 లక్షల రేషన్  కార్డులను కత్తిరించారు. మహానేత రాజశేఖరరెడ్డిగారు మంజూరు చేసిన పక్కా ఇళ్ళలో 8 లక్షల ఇళ్ళను తొలగించారు. ఇంకా 108, 104లు అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కొందరికే పరిమితమైంది. ఫీజు రియింబర్స్‌మెంటు బకాయిలు విడుదల కావటం లేదు. అయినా చంద్రబాబు నాయుడుగారు లోటు అంటున్నారు- ఆ లోటుకు కారణం.. చంద్రబాబు గారు చేస్తున్న విలాసా ఖర్చులు, దుబారా తపిే మరొకటి కాదు. రైతు రుణ మాణీ అని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ అని వారిని ఎలా వంచన చేశాడో.. అదే విధంగా ఇప్పుడు 8 లక్షల మంది ఉద్యోగులకు పీఆర్‌సీ పెంచకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఉద్యోగులు, ప్రజలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలంటూ పదే పదే చెపేఠ956? చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆయన మైండ్ సెంట్ మార్చుకుంటే మంచిది.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?
    ( జనవరి 8, 2015 ఈనాడు ప్రకారమే)
     2014-15 ఆర్థిక సంవత్సరంలో  మొదటి 9 నెలల్లో(ఏప్రిల్‌లో -డిసెంబరు) మన లెక్క(ర. కోట్లలో)
     పన్ను ఆదాయం రూ. 30,492.17
     పన్నేతర ఆదాయం రూ.  3,153.98
     కేంద్ర పన్నుల్లో వాటా- రూ.  11,602.82
     కేంద్ర గ్రాంట్లు- రూ. 15,621.33
     మూలధన ఆదాయం రూ.  17,380.73
     ++ వ్యయం..
     ద్రవ్య వ్యయం రూ.  67,604.11 కోట్లు
     మూలధన వ్యయం రూ. 5,917.23 కోట్లు
     మూలధన చెల్లింపులు-రూ. 4,354.33
     మొత్తం ఆదాయం రూ. 78,251.03 కోట్లు
     మొత్తం వ్యయం రూ. 77,875.67 కోట్లు
     మిగులు- రూ. 375.36 కోట్లు

    పీఆర్‌సీ ఏo చెప్పింది ?

    పీఆర్‌సీ (పదో వేతన సవరణ సంఘం) ఉద్యోగులకు 29 శాతం ఫిట్‌మెంట్ (మూల వేతనం పెంపు)ను పదో పీఆర్‌సీ కమిషనర్‌అగర్వాల్ సిఫారసు చేశారు. ఇప్పటికే రెండున్నర పీఆర్‌సీల కాలన్ని ఉద్యోగులు కోల్పోయారని.. ఇప్పుడు ఫిట్‌మెంట్ గరిష్టంగా 69 నుంచి 79 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పీఆర్‌సీ అమలు తేదీ కూడా మరో కీలాకాంశం 2013 జూలై నుంచి ఉద్యోగులకు ఆర్థిక లబ్ధిని వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    2013 ప్రథమార్థ గణాంకాల ఆధారంగా పీఆర్‌సీ కనీస వేతనాన్ని నిర్ణయించిందని ఏడాదిన్నర తరువాత దాన్ని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు నష్టం కలుగుతుందని అంటున్నారు. ఒక కుటుంబం అంటే నలుగురు సభ్యులు. కానీ ముగ్గురు సభ్యులనే ప్రామాణికంగా తీసుకుంది. పదో పీఆర్‌సీ చేసిన మూల వేతనాల (పే స్కేళ్ల) ప్రకారం కనీస వేతనం రూ.13 వేలు గరిష్ట వేతనం రూ.1,10,850గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 4.2 లక్షలమంది ఉద్యోగులు, 3.9 లక్షల మంది పెన్షనర్లు పీఆర్‌సీ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పీఆర్‌సీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోంది.
Back to Top