విజయవాడః బెజవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సుకు రూ.కోటి ఖర్చుపెట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. లోటు బడ్జెట్ ఉందంటూనే స్టార్ హోటళ్లలో సదస్సు కోసం అధికారులు ఇంత ఖర్చుపెట్టడాన్ని తప్పుబడుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్ల సదస్సు కోసం హైదరాబాద్ నుంచి 32 శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, 80 మంది హెచ్వోడీలు హాజరయ్యారు.<br/>అధికారులు, మంత్రుల కోసం నగరంలోని పలు స్టార్ హోటళ్లలో భోజనం, బసకోసం వసతులు ఏర్పాటు చేశారు. వీరు సదస్సుకు హాజరయ్యేందుకు విమానఛార్జీల కోసం రూ.లక్షలు ఖర్చుచేయడంపై సీనియర్ అధికారులు విస్తుపోతున్నారు. ఆసదస్సు ఏదో హైదరాబాద్ లోనే నిర్వహించి ఉంటే రూ.కోటి మిగిలుండేదని అంటున్నారు.