చంద్రబాబే జవాబివ్వాలి..మాజీమంత్రి పార్థ సారధి

విజయవాడ)) రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్దతిని ఎందుకు ఎన్నుకొన్నారో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జవాబు ఇవ్వాలని మాజీమంత్రి, వైయస్సార్సీపీ అధికార
ప్రతినిధి పార్థ సారధి డిమాండ్ చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన
మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సహా అంతా ఈ పద్ధతిని తిరస్కరించారని ఆయన
గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ
కోరుకొన్నట్లు గా రాజధానిని నిర్మించటం లేదని, కేవలం తమ మనుమలు, ముని మనుమల దాకా
డబ్బు కొట్టేసేందుకే దీన్ని నిర్మిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పైగా వైయస్ జగన్
మీద అభాండాలు వేస్తున్నారని పార్థ సారధి నిలదీశారు. మంత్రిమండలి అంటే దోపిడీ అంశాల
మీద చర్చకు పరిమితం అవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల్ని నిలువునా ముంచుతూ
పరిపాలన సాగుతోందని ఆయన సూటిగా విమర్శించారు. 

Back to Top