రౌడీల క్యాబినెట్ కు అధ్యక్షుడిగా చంద్రబాబు

  • టీడీపీ నేతలు వీధిగూండాల్లా ప్రవర్తిస్తున్నారు
  • క్రిమినల్ కేసులన్న వారి కేసులు ఎలా ఎత్తేస్తారు..?
  • ఇష్టమొచ్చినట్లు తీసేయడానికి రాష్ట్రం మీ అబ్బ జాగీరా..?
  • జీవోలన్నీ రద్దు చేయాల్సిందే..కేసులను ఎదుర్కోవాల్సిందే
  • బాబు 18 కేసుల్లో తెచ్చుకున్న స్టేలన్నీ ఉపసంహరించుకోవాలి..
  • నిజాయితీ నిరూపించుకోవాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
శ్రీకాకుళంః గూండాలు, హంతకులు, రౌడీల క్యాబినెట్ కు చంద్రబాబు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారంటూ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, హైపవర్ కమిటీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావడం మా దౌర్భాగ్యమన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా వీధి గుండాల కన్నా అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులపై ఉన్న కేసులు ఎత్తేసేందుకు బాబు మూడేళ్లలో 132 జీవోలు విడుదల చేయడంపై తమ్మినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ జీవోలు రద్దు చేయాలని, ప్రతి ఒక్కరూ కేసులను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. బాబు కేసుల ఎత్తివేతపై న్యాయపోరాటం చేస్తామని  శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మినేని సీతారం చెప్పారు. 

డబ్బులు దండుకోండి, ఎన్నికలకు ఖర్చుపెట్టండంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే తన నాయకులకు పిలుపునిస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులున్న టీడీపీ శాసనసభ్యుల కేసులను తొలగించారంటే ముఖ్యమంత్రి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించారు. శాసనసభ్యత్వం అంటే గూండాలు, రౌడీలు, హంతకులా బాబు...? ఇలాంటి వాళ్లకు టికెట్ ఇచ్చి శాసనసభలోకి పంపిస్తావా అంటూ విరుచుకుపడ్డారు. 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబని తమ్మినేని దుయ్యబట్టారు. బాబుకు  దమ్ము, ధైర్యం ఉంటే ఆ కేసులను ఉపసంహరించుకొని ఎంక్వైరీకి సిద్ధపడాలని, తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. కుల, మతాలు, రాగద్వేషాలకతీతంగా పరిపాలన సాగిస్తానని ప్రమాణస్వీకారం చేసిన నీవు ఇవాళ చేస్తున్నదేంటని ఎత్తిపొడిచారు. 

తెలుగుదేశం నాయకుడైతే చాలు కేసులన్నీ ఎత్తేస్తారా..? క్రైం ఫ్రీ స్టేట్ అంటే కేసులు ఎత్తేయడమేనా బాబు అని తమ్మినేని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో  మైన్స్ మాఫియా, సాండ్ మాఫియా, వైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా రాజ్యం నడుస్తోందని అన్నారు.  అమ్మాయిలను చెరపి బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్న వైనం పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చినా కూడ వారిని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగిస్తున్నావు సిగ్గు లేదా బాబు నీకు అంటూ తమ్మినేని ఫైర్ అయ్యారు. పవిత్ర శాసనవ్యవస్థకు అధ్యక్షుడైన స్పీకర్ స్థానంలో క్రిమినల్ ను కూర్చోబెట్టారని మండిపడ్డారు. మంత్రులు దేవినేని ఉమ, రవీంద్ర, అచ్చెన్నాయుడు, నక్కా ఆనందరావు, గంటా శ్రీనివాసరావుల కేసులన్నీ ఉపసంహరిస్తావా...? ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడానికి  రాష్ట్రం మీ అబ్బ జాగీరా అంటూ తమ్మినేని చంద్రబాబు సర్కార్ పై నిప్పులు గక్కారు. 
ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ను నడిరోడ్డుపై నిలబెట్టి  దేవినేని ఉమ, కేశినేని, బుద్ధా వెంకన్నలు దౌర్జన్యం చేశారు. అలాంటి వాళ్ల కేసులు ఉపసంహరిస్తావా..? వనజాక్షి దగ్గరి నుంచి కమిషన్ వరకు మీరు చేసిందేంటి. ఎమ్మెల్యేలా, మీరు రౌడీలా..? అంటూ తమ్మినేని ఫైర్ అయ్యారు. తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top