బాబు చెప్పేవన్ని కాకమ్మ కథలే

  • ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా టీడీపీ తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయం
  • నారా బ్రహ్మీణి సర్వేలోనే టీడీపీకి 26 సీట్లు వస్తాయని తేలింది
  • లోకేష్‌ను అడ్డదారిలో అధికారంలోకి తెచ్చేందుకు బాబు ప్రయత్నాలు
  • దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రావాలి
  • మీడియాను కంట్రోల్‌ చేసేందుకే ఫైబర్‌ గిడ్‌ 
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరు:  ఏపీ సీఎం చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని, అధికారం శాశ్వతమనే భ్రమలో ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇలా విర్రవీగిన నాయకులు మట్టిలో కలిసిపోయారని, బాబుకు అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. తన కుమారుడు నారా లోకేష్‌ను దొడ్డిదారిలో అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే ఏదో ఒక చోట పోటీ చేయించి, గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న టీడీపీ వర్క్‌షాప్‌ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఆశ్చరర్యకరంగాను, వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలట. మీడియాలో వచ్చే న్యూస్‌ అరికట్టాలట. ఈ క్షణంలో ఎన్నికలు నిర్వహిస్తే 120 సీట్లు టీడీపీకి వస్తాయట. అంత మితిమీరిన విశ్వాసం ఉంటే వైయస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు. మీ అబ్బాయి లోకేష్‌ను ఎందుకు దొడ్డిదారిన తీసుకొని వస్తున్నారు. సింహం మార్గంలో తీసుకొని రావచ్చు కదా. ఒక్క చోట రాజీనామా చేయించి లోకేష్‌ను గెలిపించుకోండి. ఎన్నికలు అయిపోయిన తరువాత టీడీపీ «అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్‌ ఎన్నికలు పెట్టమంటే ఎందుకు వాయిదాలు అడుగుతున్నారు. మీరు చెప్పేవన్నీ కాకమ్మ కథలే. 120 కాదు, మీరు సర్వే చేస్తే 20 సీట్ల కన్న ఎక్కువ రావని చెబుతున్నాయి. నారా బ్రహ్మీణి సర్వేలోనే 26 సీట్లు వస్తాయని తేల్చారు. ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత వరకు చంద్రబాబు అధికారంలో ఉండాలట. నీ కన్న పెద్ద పెద్ద వాళ్లు ఇలాగే విర్రవీగి మట్టి కరిచారు. 

మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు
రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఫైబర్‌గిడ్‌ ద్వారా మాత్రమే అన్ని కేబుల్‌ ప్రసారాలు వెళ్లాలని సీఎం ప్రణాళిక రూపొందించారు.  ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిన బాధ్యత పత్రికలకు ఉంది. ఆ స్వేచ్ఛను హరించాలనే కుట్ర జరుగుతుంది. ఒక చానల్‌ ఏపీలో 4 నెలల పాటు ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడారని ఓ సీనియర్‌ జర్నలిస్టును తొలగించారు. ముద్రగడపద్మనాభం పోరాటం చేస్తుంటే ఆ ప్రసారం రాకుండా అడ్డుకున్నారు. ఎంఎస్‌వోలను బెదిరించి ఆపివేశారు. మీడియాను కంట్రోల్‌ చేయాలని చంద్రబాబుకు దుర్భద్ది. చంద్రబాబు ఓ మహిళలను దుర్భషలాడితే ఆ విషయం జాతీయ మీడియాలో వస్తే దానిపై నిప్పులు చెరుగుతున్నారు. జాతీయ మీడియాను కూడా కంట్రోల్‌ చేయాలని అప్రజాస్వామిక కుట్రతో వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఫైబర్‌ గ్రిడ్‌తో ఐటీ టీవీ తీసుకొని వచ్చారు. ఇంటర్‌నెట్‌ ద్వారా వచ్చే ఈ టీవీని ప్రసారం చేయాలని ఎంఎస్‌వోలను బెదిరిస్తున్నారు. అనధికారికంగా ఓ జీవో విడుదల చేశారు. కరెంటు స్తంభాలపై ఉన్న  కెబుల్‌ వైర్లు ఉండకూడదని జీవో ఇచ్చారు. ఇందు కోసం పోలీసుల సాయం తీసుకోవాలని టీడీపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. సొంతంగానే మీడియాపై ఆధిపత్యం చెలాయించాలని బాబు దుర్భద్ది. ప్రభుత్వానికి మీడియాను కంట్రోల్‌ చేసే హక్కు లేదు. డీఏఎస్‌ అన్న దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఎంఎస్‌వోలు ఈ డీఏఎస్‌ నుంచి లైసెన్స్‌ తీసుకోవాలి. ఎలక్ట్రికల్‌ పోల్స్‌పై ఎవరైనా కేబుల్‌ వర్స్‌ వేసుకోవచ్చు. ఇది దౌర్భగ్యమైన పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారు. వాస్తవాలను వివరిస్తున్నారని చంద్రబాబు భయపడి మీడియాపై పెత్తనం చెలాయించేందుకు ఫైబర్‌ గిడ్‌ పెట్టారు. ఎంఎస్‌వోలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుంది. వ్యవస్థలను కంట్రోల్‌ చేయాలని ప్రయత్నిస్తే మూతిపళ్లు రాలుతాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి కుమారులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేటీఆర్, కవిత సింహం ద్వారాలో రాజకీయాల్లోకి వచ్చారు. మీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే మీ కుమారుడు లోకేష్‌ను సింహం ద్వారం ద్వారా తీసుకొని రావాలి.

తాజా ఫోటోలు

Back to Top