ప్ర‌తిప‌క్షమే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు: ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి: ప‌్ర‌తిప‌క్షమే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నార‌ని పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉందని ఆయ‌న‌ అన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా కలకడ మండలంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్సీపీ పట్ల చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామ‌ని, ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని మిథున్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Back to Top