ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదు: వైఎస్ జగన్

అనంతపురం: ఆడబిడ్డలు కన్నీరుపెడితే మంచిదికాదని, తాను అండగా ఉంటానని అంగన్వాడీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు కదిరిలో వైఎస్ జగన్ను కలిశారు. తమ సమస్యలు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయిస్తుందని తెలిపారు. పనికి తగ్గ వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు నాయుడు సభలో ఫ్లకార్డులు ప్రదర్శించిన 15 మంది అంగన్వాడీ కార్యకర్తలను తొలగించారని తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయమని వారు వైఎస్ జగన్ను కోరారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసినట్లు చెప్పారు. ఆడబిడ్డలు కన్నీరు పెడితే మంచిదికాదన్నారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలపై పోరడతామని జగన్ చెప్పారు.
Back to Top