టీడీపీకి పతనం తప్పదు

గాండ్లపెంట: స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచిన టీడీపీకి భవిష్యత్తుల్లో పతనం తప్పదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రకార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించడంతో పార్టీ మండ‌ల క‌న్వీన‌ర్‌ పోరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆధ్వ‌ర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం వజ్రభాస్కరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్నికుయుక్తులు పన్నినా ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ధ్రుల ఓట్ల‌రు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారన్నారు. ఇది ప్రజా విజయమని భవిష్యత్తులో కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో నాయకులు వైస్‌ ఎంపీపీ ఆదెప్పనాయుడు, మాజీ జడ్పీటీసీ భాస్కరరెడ్డి, సర్పంచ్‌లు చంద్రశేఖరరెడ్డి, రవీంద్రారెడ్డి, నాయకులు రామక్రిష్ణారెడ్డి, గజ్జలరవీంద్రారెడ్డి,రామాంజులరెడ్డి, క్రిష్ణారెడ్డి, రమణ, డాక్టర్‌ వేమయ్య, బాషా, కోండయ్య, ఆంజినేయులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరోవైపు, ర‌ోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ పూల చాంద్‌బాషాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కరరెడ్డి బుధవారం పరామర్శించారు.  ఆర్దిక సహాయం అందించి యోగ‌క్షేమాలను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వజ్రభాస్కరరెడ్డి వెంట మండల కన్వీనర్‌ పోరెడ్డిచంద్రశేఖరరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆదెప్పనాయుడు, నాయకులు భాస్కరరెడ్డి సర్పంచ్‌ రవీంద్రారెడ్డి, గజ్జలరవీంద్రారెడ్డి,రామాంజులరెడ్డి,బాషా,బహువుద్దీన్,ఇసాక్‌ ,సయ్యద్,ఆశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Back to Top