ఆగస్టులో బాబు కుట్రలు

హైదరాబాద్ః పుష్కరాల ఆహ్వానం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నీచ రాజకీయాలు చేసింది. ప్రతిపక్ష నాయకుడి ఇమేజ్ ను దెబ్బతీసేందుకు బాబు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. దళిత మంత్రిని,ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకొని వైయస్ జగన్ పై బురదజల్లాలని ప్రయత్నించిన బాబు ఆటలు సాగలేదు. 


టీడీపీ దిగజారుడు రాజకీయాలు...

()చంద్రబాబు సర్కార్ కుట్ర రాజకీయాలు పుష్కరాల సందర్భంగా మరోసారి వెలుగుచూశాయి. 
()ఆగస్టు నెల వచ్చిందంటే చాలు బాబు తనలోని కుయుక్తులకు మరింతగా పదునుపెడతారన్నది మరోసారి రుజువైంది
()ఆనాడు పిల్లనిచ్చిన మామను ఆగష్టు నెలలోనే క్షోభకు గురిచేసి వెన్నుపోటు పొడిచారు
() ఇవాళ ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిపక్ష నాయకుడిపై బురదజల్లేందుకు మరో పన్నాగానికి స్కెచ్ వేశారు
() ప్రతిపక్షంపై కక్షసాధింపుకు చంద్రబాబు ఈసారి పన్నేండేళ్లకోసారి వచ్చే పుష్కరాలను వాడుకొని రాజకీయం చేశారు
() పుష్కరాలకు ముందే అటు ఢిల్లీ, ఇటు రాష్ట్రమంతా ఆహ్వాన పత్రికలు పట్టుకొని చక్కర్లు కొట్టిన బాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలనే ప్రధాన ప్రతిపక్షాన్ని విస్మరించారు
() పుష్కరాలు ప్రారంభమయిన మరుసటి రోజు ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వానం పంపే పేరుతో చంద్రబాబు ఓ  మంత్రిని, ఎమ్మెల్యేను వైయస్ జగన్ నివాసానికి పంపించారు
() దళిత మంత్రిని, ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకొని వైయస్ జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నాగం పన్నారు. 
() బాబు డైరక్షన్ లో వైయస్ జగన్ లేని సమయం చూసుకొని రావెల కిషోర్ బాబు, కూన రవికుమార్ లు లోటస్ పాండ్ కు మీడియాను వెంటబెట్టుకొని వచ్చారు. వెళ్తూ ఆహ్వానం పంపించేందుకు వస్తే అవమానించారని టీవీలకు లీకులిచ్చి పథకం ప్రకారం డ్రామాను రక్తికట్టించారు.
() ఇంటికొచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి, వారికి టీ ఆతిథ్యమిచ్చి వైయస్ జగన్ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే..బాబు సంస్కారహీనంగా ప్రవర్తించారు
() మేలు చేసిన వైయస్ కుటుంబానికి బాబు కీడు శంకిస్తున్నారు
() ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించాల్సిన చంద్రబాబు నిబంధనల్ని ఉల్లంఘించి మర్యాద తప్పారు. 
() మామాలుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసినా బాబు ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిపక్షాన్ని అవమానిస్తూ వస్తున్నారు
() పుష్కరాల మాటున ఆహ్వానం పేరుతో ప్రతిపక్ష నాయకుడి కారెక్టర్ ను దెబ్బతీయాలని చూసి  చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. బాబు బాగోతాన్ని గమనించిన ప్రజలు వారి దిగజారుడు రాజకీయాలను చూసి చీధరించుకుంటున్నారు. 



Back to Top