మూడేళ్లు మాయ పాలనే

–రైతులకు అందని రుణమాఫీ
–డ్వాక్రా మహిళలకు తీరని అప్పులు
–ఊసేలేని నిరుద్యోగ భృతి
–టీడీపీ మూడేళ్ల పాలపై కావటి మనోహర్‌ నాయుడు ధ్వజం

కాశిపాడు(పెదకూరపాడు)ః రైతులు, డ్వాక్రా గ్రూపుల రుణాలు రద్దు... నిరుద్యోగులకు భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ 2014 ఎన్నికలలో ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ మూడేళ్లు మాయ పాలన చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివ నాగమనోహర్‌ నాయుడు అన్నారు. మండలంలోని కాశిపాడు గ్రామంలో పార్టీ నేతలతో కలసి విలేకర్లు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కావటి శివ నాగమనోహర్‌ నాయుడు మాట్లాడుతూ రైతులకు నామమాత్రంగా రుణ మాఫీ చేశారని డ్వాక్రా గ్రూపులకు మొండి చెయ్యి చూపారని, వడ్డీలు కట్టలేక చేసిన అప్పులు తీర్చలేక గ్రూపు సభ్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగుల కు నిరుగ్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఐసే లేదన్నారు.ఎన్టీర్‌ సుజల స్రవంతి గ్రామాల్లో కనిపించడం లేదన్నారు.తొలి సంతకం పెట్టిన బెల్టు షాపులు రద్దు పథకం మద్యానికి కొట్టుకుపోయిందన్నారు.ప్రజలను , రైతులను డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, రైతుకూలీలను ఈ మూడేళ్లలో అంతా మోసం చేశాడని అన్నారు. జన్మభూమి కమిటీ పేరుతో టీడీపీ వారికి ప్రజాధనం దోచిపెట్టారని అన్నారు.ఇసుకను తిన్నారని విమర్శించిరాఉ.ఇచ్చిన హామీలు నీరుగారిపోయ్యాని చెప్పారు.టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారిపై దాడులు పెరిగాయని అన్నారు. విదేశాలల్లో తిరుగుతూ , గ్లోబుల్‌ ప్రచారం చేస్తూ ప్రజల ధనం వృధ చేశారే తప్ప ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇచ్చిన ధఖాలాలు లేవని అన్నారు.గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడ్డారని అన్నారు. నకీలి విత్తనాలుతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారని అన్నారు. రాజాధాని నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడారని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మరింత అవస్థలు పాలు చేస్తునరని అన్నారు. అభివృద్ధి చేసిన ధఖాలాలు లేవని అన్నారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్‌ బెలంకొండ మీరయ్య, జిల్లా పార్టీ కార్యవర్గసభ్యులు ఈదా సాంబిరెడ్డి, మంగిశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీ మైనేని నరేంద్రం లగడపాడు గ్రామ సర్పంచ్‌ షేక్‌ ఖాశీంషరీప్, కాశిపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లెల మధుసూదనరావు, పార్టీ నేతలు మల్లెల కోటేశ్వరరావు, రవికుమార్, బాస్కరావు, వజ్రల వెంకటరెడ్డి, బొబ్బిళ నాగేశ్వరరావు, పెద్దింటి వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు. అనంతరం పార్టీ నేత కొత్తం శెట్టి సాంబశివరావు కుమారుడు వివాహానికి హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top