చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వైయస్‌ జగన్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన ధర్మాసనం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టు భద్రతా లోపాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్‌ పోర్టులో భద్రతా లోపాలు క్షమించరాదని ధర్మాసనం పేర్కొంది. మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైయస్‌ జగన్‌ రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.  వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు, డీజీపీ, కేంద్ర హోంశాఖ, ఎయిర్‌పోర్టు భద్రతా అధికారికి కూడా నోటీసులు జారీ చేసింది. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన విచారణపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సీసీ టీవీ పర్యవేక్షణ ఎవరి ఆధీనంలో ఉందో జవాబు చెప్పలేకపోయిన సిట్‌ అధికారులు. నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడ అంశాన్ని కోర్టుకు వైయస్‌ జగన్‌ న్యాయవాది మోహన్‌రెడ్డి వివరించారు. 
 
Back to Top