'చంద్రబాబు వల్లే రాష్ట్రానికి బాబ్లీ ప్రమాదం'

హైదరాబాద్, 28 ఫిబ్రవరి 2013: అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రానికి బాబ్లీ ప్రాజెక్టు ప్రమాదం ముంచుకు వచ్చిందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె. మహేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుత‌ం అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి ఏమాత్రం శ్రద్ధ చూపలేదన్నారు. గోదావరినదిపై ఎగువన డజను ప్రాజెక్టులు కట్టేస్తున్న మహారాష్ట్ర పై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒత్తిడి పెంచలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 40 మంది ఎం.పి.లు ఉన్నా బాబ్లీ నిర్మాణాన్ని ఆపేలా కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి చేయలేదన్నారు.
Back to Top