మహిళా భద్రత గురించి గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు రంగు బయట పెట్టుకొన్నారు. ఇసుక మాఫియా కు అండగా నిలిచారు. కృష్ణా జిల్లా లో ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకొనేందుకు మహిళా తహశీల్దార్ వనజాక్షి ప్రయత్నించినప్పుడు టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన సంగతి తెలిసిందే. మహిళా అధికారిని జుట్టు పట్టించి ఇసుకలో ఈడ్పించి దాడి చేయించారు. ఈ విషయమై మహిళాలోకంలో తీవ్ర నిరసన వ్యక్తం అయితే, ఉద్యోగ సంఘాల్ని బెదిరించి ఆమె నోరు మూయించారు. స్వయంగా ముఖ్యమంత్రే సెటిల్ మెంట్ రాయుడిగా మారి వ్యవహారానికి మసి పూసి మారేడు కాయ చేశారు.ఇప్పుడు దీన్ని వ్యవస్థీకృతం చేశారు. మంత్రి మండలి సమావేశంలో దీన్ని చర్చకు తెచ్చి, మొత్తం మంత్రి మండలి అంతా విప్ చింతమనేని ప్రభాకర్ కు మద్దతుగా నిలిచింది. అసలు తప్పంతా తహశీల్దార్ వనజాక్షి దే అని తేల్చారు. దీంతో ఈ వ్యవహారానికి అంతటితో బ్రేకు వేసినట్లయింది.వాస్తవానికి దీని వెనుక అసలు కథ వేరొకటి ఉంది. ఇసుక మాఫియా లో చంద్రబాబు కోటరీ కి వాటా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఒక మహిళా అధికారి మీద పట్టపగలు నిస్సిగ్గుగా దాడి చేయించి, తర్వాత అదే విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని సెటిల్‌మెంట్ చేయించుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో చింతమనేని మీద ఈగ కూడా వాలడానికి కూడా ఇష్టపడలేదు. పైగా అధికారిని పిలిపించి బెదిరించి పంపేశారంటే ఇసుక మాఫియా ప్రభుత్వం తో ఏ స్థాయిలో చెట్టా పట్టాల్ వేసుకొని ఉందో అర్థం అవుతోంది. అందుకే మహిళల భద్రతకు చంద్రబాబు అంతటి ప్రాధాన్యం ఇచ్చాడన్న మాట..!------------ <br/>