తప్పుడు జీవోలతో తప్పించుకున్న కేసులను తిరగదోడతాం

అచ్చంపేటః మీకు అనుకూలంగా జీవోలు జారీ చేసి, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు, వైయస్సార్‌ సిపి నుండి మీ పార్టీలో చేరిన శాసన సభ్యులపై ఉన్న కేసులను రద్దు చేసుకోవడం న్యాయమా చంద్రబాబూ... ఈ విధంగా ఎన్నడైనా జరిగిందా అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. స్థానిక పులిచింతల నిర్వాశిత కేంద్రంలో జరిగిన ఒక వివాహవేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడుతో కలసి విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌లపై దాడిచేసి, పోలీసులను గాయపరచిన వారిపై ఉన్న కేసులను కూడా రద్దుచేసుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. 2014లో వైయస్సార్‌ పార్టీ నుండి గెలుపొందిన గిద్దలూరి అశోక్‌రెడ్డి టీడీపీలో చేరిన తరువాత చేసిన నేరాలన్నింటిని ఒక్క జీవోతో కొట్టివేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సీయం చంద్రబాబుకు చట్టం, న్యాయం, ధర్మంపై గౌరవం లేదని, తప్పులు చేస్తూ తప్పించుకోవడమే తెలుసునని ఎద్దేవా చేశారు. వైయస్సార్‌ సిపి అధికారంలోకి రాగానే తప్పుడు జీవోలతో తప్పించుకున్న కేసులన్నింటిని తిరగతోడతామని, న్యాయవిచారణ జరిపిస్తామని, అప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top