స్పీకర్ కోడెల మీద సుమోటో గా కేసు నమోదు చేయాలి..అంబటి రాంబాబు

 హైదరాబాద్)) స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మీద సుమోటో గా కేసు నమోదు చేయాలని
ఎన్నికల సంఘాన్ని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కోరారు. హైదరాబాద్
లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల
నియమావళి ప్రకారం..ఏపీలో శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్న వ్యక్తి 28 లక్షలకు, ఎంపీ 78 లక్షలకు మించి ఖర్చుచేయకూడదు. అధి ఎన్నికల
నియమావళికి విరుద్ధమైనదని రాంబాబు అభిప్రాయ పడ్డారు. అటువంటప్పుడు 11 కోట్ల 50
లక్షలు ఖర్చు పెట్టానని స్వయంగా కోడెల బయట పెట్టడాన్ని గుర్తు చేశారు. ఆయన
శాసనసబ్యుడిగా కొనసాగేత అర్హత చట్టప్రకారం ఆయనకు లేదు. దీన్ని సుమోటాగా పరిగణించి
ఆయనపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు కోరారు.  ఏదైనా తాత్సారం జరిగితే రాతపూర్వకంగా
ఫిర్యాదుచేసి చర్యలు తీసుకునేందుకు తాము సిద్దమని చెప్పారు. అందుకోసమే
విచ్చలవిడిగా అవినీతి కి కోడెల, ఆయన కుటుంబ సభ్యులు పాల్పడుతున్నారని అంబటి
రాంబాబు ఆరోపించారు. 

Back to Top