రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

హైదరాబాద్

 :శాంతియుత నిరసనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కనీసం క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొననివ్వకుండా ఎయిర్‌పోర్టులోనే ఆయనను నిర్బంధించిన తీరును పార్టీ తీవ్రంగా నిరసించింది. 

 
ఈ వైఖరికి నిరసనగాను, ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగాను ఈనెల 27వ తేదీ శుక్రవారం రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.

తాజా ఫోటోలు

Back to Top