నంద్యాలలో తిష్టేసిన క్యాబినెట్ ముఠా

నంద్యాలః చంద్ర‌బాబు కేబినెట్ ముఠా అంతా నంద్యాల‌లో చేరి ఓట‌ర్ల‌ను బెదిరింపుల‌కు గురిచేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. నంద్యాల‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి జీవితాంతం సేవ చేసిన శివారెడ్డిని హ‌త్య చేయించిన ఫ్యాక్ష‌న్‌ నేతగా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నిలిచిపోయార‌న్నారు. అలాంటి వ్య‌క్తికి నైతిక విలువ‌లు పాటించే వైయ‌స్ఆర్ సీపీని విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని మండిప‌డ్డారు. నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను బ‌హిరంగ‌ంగా బెదిరిస్తూ మీకు బుద్ధి ఉందా అని బెదిరించిన వ్య‌క్తి చంద్ర‌బాబు అన్నారు. చంద్ర‌బాబు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని కుట్ర‌లు చేసినా నంద్యాల‌లో వైయ‌స్ఆర్ సీపీ జెండా ఎగుర‌వేయ‌డం ఖాయ‌మ‌న్నారు. 

న‌క్క‌జిత్తుల నాట‌కాల్లో బాబు ఫ‌స్ట్‌
నంద్యాలః న‌క్క‌జిత్తుల నాట‌కాలాడి ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్త‌ఫా, కొరుముట్ల శ్రీ‌నివాసులు విమ‌ర్శించారు. నంద్యాల‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం అమ్ముడుపోయిన వ్య‌క్తుల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీని విమ‌ర్శించే హ‌క్కు లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి వ‌చ్చేప్పుడు అంద‌రూ రాజీనామా చేసి రావాల‌ని పిలుపునిచ్చిన నీతిమంతుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. చంద్ర‌బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నంద్యాల మైనార్టీలంతా వైయ‌స్ఆర్ సీపీ వైపే ఉన్నార‌న్నారు. టీడీపీ నేత‌లు చ‌వ‌క‌బారు మాట‌లు మానుకోకుంటే త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌న్నారు. నంద్యాల‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. 


Back to Top