కర్నూలులో బుట్టా రేణుక పర్యటన

కర్నూలుః  ఎంపీ బుట్టా రేణుక ఇవాళ  జిల్లాలోని తుగ్గలి మండలంలో పర్యటించనున్నారు.  పగిడిరాయి, జీ.ఎర్రగుడి గ్రామాల్లో బుట్టా రేణుక పర్యటించనున్నట్లు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జిట్టా నగేష్ తెలిపారు. ఎంపీ నిధుల కింద పగిడిరాయిలో రూ. 5లక్షలు ..జీ. ఎర్రగుడి గ్రామంలో రూ. 6లక్షలతో చేపట్టిన తాగునీటి పథకాలను ఆమె ప్రారంభిస్తారు. ఎంపీతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకుపాడు నారాయణరెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొననున్నారు.

Back to Top