వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఫేస్‌బుక్‌కు విశేష స్పందన

పాలకొండ (శ్రీకాకుళం జిల్లా) :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఫేస్‌బుక్‌లో విశేష స్పందన లభిస్తోంది. సోషల్ నె‌ట్‌వర్కింగ్ వె‌బ్‌సైట్ ‘ఫే‌స్‌బుక్’లో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ లక్షా 16 వేల మంది అభిమానులను సంపాదించుకుంది. ఫేస్‌బుక్‌లో ఇంత మొత్తంలో ఫాలోయర్సును సంపాదించుకున్న తొలి ప్రాంతీయ పార్టీగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ నిలిచింది. ఫేస్‌బుక్‌లో అధికారికంగా పేజీ‌ తెరిచిన నాలుగు నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో అభిమానులను పార్టీ సంపాదించుకోవడం విశేషం.

‌జాతీయ స్థాయిలో 10,78,510 మంది అభిమానులను పొందిన బిజెపి ఫేస్‌బుక్‌లో తొలి స్థానంలో ఉండగా.. 2,47,396 మందితో ఆమ్ ఆద్మీ రెండవ స్థానంలో నిలిచింది. కాగా, 1,25,000 మంది ఫాలోయర్సుతో నేషనల్ కాంగ్రె‌స్ పార్టీ మూ‌డవ స్థానంతో సరిపెట్టుకుంది. లక్షా 16 వేల మంది అభిమానులతో ఆ తరువాతి స్థానంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీయే జోరు కొనసాగిస్తోంది.

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం డొంకలపర్తలో బుధవారంనాడు పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలను పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూద‌న్‌రెడ్డి నేతృత్వంలో ఐటి విభాగం సభ్యులు కలుసుకుని ఫేస్‌బుక్‌కు వచ్చిన స్పందన వివరాలను తెలిపారు. పార్టీ ఐటి బృందం సభ్యులు పంటా సురేందర్‌రెడ్డి, పండుగాయల రత్నాకర్‌లను శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top