అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడు

  • రాజారెడ్డిని హత్య చేయించింది చంద్రబాబే
  • వంగవీటి రంగాను అంతమొందించింది బాబే
  • అధికారం కోసం అందరినీ వాడుకోవడం బాబు నైజం
  • సొంత కుటుంబాన్నే సర్వనాశనం చేసిన ఘనాపాటి చంద్రబాబు
  • వైయస్ఆర్ బిక్షతో బాబు మంత్రి అయ్యాడు
  • ఇతరులకు ప్రేమను పంచే స్వభావం వైయస్ కుటుంబానిది
  • తన అవసరాల కోసం కుటుంబాన్ని వాడుకునే నీచస్వభావం బాబుది
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతిః చంద్రబాబు హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నాడని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజారెడ్డిని హత్య చేయించింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. ఆ హంతకులను 30 రోజుల పాటు ముఖ్యమంత్రి నివాసంలోనే ఏర్పాటు చేశారని ఆనాడు మొత్తం మీడియా, ప్రతిపక్షాలు కోడై కూశాయని గుర్తు చేశారు.  అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం  ఫ్యాక్షన్ రాజకీయాలను ఉసిగొల్పి ఇతరులను ధ్వంసరచన చేయడం బాబు నైజమని భూమన అన్నారు. అమరావతిలో కావాల్సినంత ఆదాయాన్ని దోచుకుందాం రా రా మనుమడా అంటూ చంద్రబాబు తన మనమడికి అంటే అమరావతి, ఆదాయం  అని నేర్పిస్తున్నారని భూమన ఎద్దేవా చేశారు. 

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోడు పొడిచి, తోడల్లుడిని తొక్కేసి, బావమరిది హరికృష్ణను బయటకు రాకుండా చేసి, కుర్రాడు ఎన్టీఆర్ ను కూరాకుల వాడుకొన్న చరిత్ర చంద్రబాబుదని భూమన విమర్శించారు. తన అధికారం కోసం సొంత కుటుంబంలోని అందరినీ సర్వనాశనం చేసి సరికొత్త ఫ్యాక్షన్ ను రంగంలోకి తెచ్చిన ఘనాపాటి దేశచరిత్రలో చంద్రబాబు ఒక్కరేనని ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి బిక్షతోనే 1981లో బాబు మంత్రి అయ్యాడని భూమన చెప్పారు. టీడీపీలోకి వెళ్లాక రాజారెడ్డితో టచ్ లో ఉండి రాజకీయాలను వాడుకున్న వ్యక్తి బాబు అని ఫైర్ అయ్యారు. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఏనాడు ఫ్యాక్షన్ రాజకీయాలు నడపలేదని భూమన అన్నారు. అలా చేసి ఉంటే బాబు రాజకీయాల్లో మనగలిగేవాడు కాదన్నారు. బాబు లాగ మామను, తమ్ముడిని, బావమరిదిని అందరినీ రాజకీయానికి వాడుకునే నీచ స్వభావం రాజశేఖరరెడ్డి కుటుంబానిది లేదన్నారు. ఇతరులకు ప్రేమను పంచి ఆదరణ చూపిన కుటుంబం,  నమ్ముకున్న వాళ్లను ఆకాశానికెత్తిన కుటుంబం వైయస్ఆర్ దని చెప్పారు. 

రాజారెడ్డి హంతకుడివి నీవే. నీవు అధికారంలో ఉండగానే రాజారెడ్డి హత్యగావించబడ్డారని భూమన బాబుపై మండిపడ్డారు. వంగవీటి రంగాను హత్య చేయించింది బాబేనని ఆనాటి మంత్రివర్గంలో ఉన్న హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాసిన విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తించారు. ఆ రోజుల్లోనే ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు స్కూటర్ మీద వెళ్తుంటే విజయవాడలో బస్సుతో గుద్ది చంపించింది నీవు కాదా బాబు..? అని కడిగిపారేశారు. పథకం ప్రకారం ప్రభుత్వం కుట్రతో నారాయణరెడ్డిని హత్య చేయించిందని భూమన ఆరోపించారు. ఇందుకు  పోలీసు వాళ్లు చక్కగా వ్యవహరించారంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. తొమ్మదిన్నరకు నారాయణరెడ్డి హత్య గావించబడితే మధ్యాహ్నం వరకు పోలీసులు రాలేదంటే వారి వైఫల్యం కాదా..? కల్వర్టు పనులను మూడ్రోజులుగా ఎందుకు నిలిపివేశారు. హత్యలో 25మంది యువకులు ఏవిధంగా పాల్గొన్నారు...? మారణాయుధాలు ఎక్కడినుంచి వచ్చాయి. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను మటుమాయం చేస్తున్నావు అంటూ భూమన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే నైజం బాబుదని దుయ్యబట్టారు. 

చంద్రబాబు ఫ్యాక్షన్ లేకుండా చేస్తానన్నాడంటే దానర్థం ప్రతిపక్షం లేకుండా చేస్తాడనేనని అర్థమవుతోందన్నారు. కుల,మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మంట రగిలించి ఆమంటలో చలి కాచుకునే కుసంస్కారం చంద్రబాబుదని భూమన ఫైర్ అయ్యారు. బాబు అలిపిరిలో నీపై నక్సలైట్ల దాడి జరిగితే మా నాయకుడు వైయస్ఆర్ ప్రతిపక్ష నేతగా పరిగెంత్తుకుంటూ తిరుపతి వచ్చి సానుభూతి తెలపడమే గాకుండా భగవంతుని ఆశీస్సులతో ఏమీ జరగలేదు బాబు అని నిన్ను ఫ్లైట్ లో ఎక్కించి సాగనంపింది మర్చిపోయావా..? అని నిలదీశారు.  ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద  బాబుపై జరిగిన దాడి అమానవీయమైనది, నక్సలైట్ల చర్య హింసాయుత చర్య అని ఆందోళన చేసిన సగుణ సంపన్నుడు వైయస్ రాజశేఖరరెడ్డి అని భూమన తెలిపారు. అలాంటి వైయస్ఆర్ ను, ఆయన కుటుంబాన్ని  నీవు ఎన్ని మాటలన్నావ్. ఎంత నీచంగా మాట్లాడుతున్నావ్. వైయస్ఆర్, ఆయన కుటుంబం మీద, జగన్ మీద నిరంతరం హింసను ప్రేరేపించే వ్యక్తులుగా చిత్రీకరించి వాస్తవాన్ని మరుగున పర్చేసి నీ నైజాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తుడిచిపెట్టేసే కుట్ర చేశావ్ అంటూ భూమన బాబుపై ధ్వజమెత్తారు.  వాస్తవాలు చెప్పడానికి మేం ఎప్పుడు ముందుంటాం. నీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజలకు నిజం చెప్పకుండా మానంగా ఉండము. నీ చేతులు రక్తంతో తడిసి పాపపంకిలమైనవని చంద్రబాబుపై భూమన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top