<img style="float:right;margin:5px;width:243px;height:300px" src="/filemanager/php/../files/s12.jpg">కర్నూలు, 20 నవంబర్ 2012: రాష్ట్ర ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చి, వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే లక్ష్యంతో కొనసాగుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 34 వ రోజు మంగళవారం సాయంత్రం ముగిసింది. కర్నూలు శివార్లలోని సెయింట్ క్లార్కు స్కూల్ వరకు మొత్తం 15 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మంగళవారం ఉదయం కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలంలో సాగిన ఆమె పాదయాత్ర మంగళవారం మధ్యాహ్న భోజన విరామం తరువాత పాణ్యం పరిధిలోని సల్కాపురానికి చేరుకుంది.<br><br>సోమవారం రాత్రి బస చేసిన పెంచికలపాడు శివారు నుంచి మంగళవారం ఉదయం షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. పెంచికలపాడు, నాగులాపురం, సల్కాపురం, పెదపాడు ద్వారా కర్నూలు శివార్లలోని సెయింట్ క్లార్కు స్కూల్ వరకు మొత్తం 15 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర కొనసాగింది. స్కూల్ ఆవరణలో షర్మిల రాత్రి బస చేస్తారు. ఇప్పటి వరకూ షర్మిల పాదయాత్రలో మొత్తం 451.10 కిలోమీటర్లు నడిచారు. షర్మిల పాదయాత్ర బుధవారం కర్నూలు నగరంలో కొనసాగుతుంది.