వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థిని గెలిపించండి

శ్రీ‌శైలంః ఆత్మ‌కూరు మండ‌లంలో 2వ వార్డు ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి మీర్ యూనిస్‌ను గెలిపించి టీడీపీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి అన్నారు. 2వ వార్డులో విస్తృతంగా ప‌ర్య‌టించి టీడీపీ అరాచ‌కాలు, అవినీతిని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ముందు త‌ప్పుడు హామీల‌ను ప్ర‌జ‌ల‌కు కురిపించి ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచాడ‌ని శేషారెడ్డి మండిప‌డ్డారు. కౌన్సిల‌ర్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి మీర్ యూనిస్‌ను గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top