నిరుద్యోగ భృతి పేరిట బాబు మోసం



అనంతపురం: ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు సీఎం అయ్యాక మోసం చేశాడ‌ని ఉగ్యోగార్థులు విమర్శిస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం పాపం పేట- రుద్రం పేట బైపాస్ మీదుగా పాదయాత్ర కొనసాగిస్తోన్న జననేత వైయ‌స్ జగన్‌ను జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ రచన కలిశారు. ఈ సందర్భంగా అభిమాన నేతకు తన సమస్యలు చెప్పుకుని రచన కన్నీళ్లు పెట్టుకున్నారు. 

అన్నా..నేను బీటెక్ చేసి రెండేళ్లు పూర్తయింది. రాష్ట్రంలో సరైన ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నాను. గత ఎన్నికల సమయంలో ఉన్నత విద్య పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆసరాగా నిలిచేందుకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, నా చదువు పూర్తయి జాబ్ కోసం చూస్తున్న నాకు రెండేళ్లుగా నిరుద్యోగ భృతి అందలేదు. సీఎం అయ్యాక చంద్రబాబు ఏపీ యువతను దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు ఏపీకి ఎన్నో ప్రయోజనాలు అందించే ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబు వైఫల్యం వల్లే ప్రత్యేక హోదా రాలేదని, దాంతో తనలాగే ఎంతో మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వైయ‌స్ జగన్‌తో తన ఆవేదన చెప్పుకుంటూ రచన కన్నీటి పర్యంతమయ్యారు. ర‌చ‌న క‌న్నీటిని తుడిచిన జ‌న‌నేత ఆమెకు ధైర్యం చెప్పారు. మరో ఏడాది ఓపికపడితే ప్రజల ప్రభుత్వం వస్తుందని, ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామని వైయ‌స్ జగన్ భరోసా కల్పించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, హోదా సాధన కోసం వైయ‌స్ఆర్ సీపీ నిరంతరంగా శ్రమిస్తుందని ఆ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ అన్నారు.


 



Back to Top