ప్రత్యేక హోదా ధర్నాకు రైళ్ల ఏర్పాటు


హైదరాబాద్) ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ తన ఆందోళనను, పోరాటాన్ని ఉధ్రతం చేస్తోందని మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10న ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ధర్నా నిర్వహిస్తున్న సంగతి ఆయన గుర్తు చేశారు. ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, పాల్గొంటారని బొత్స చెప్పారు. పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ నెల 7న రాత్రి తిరుపతి, అనకాపల్లి నుంచి రెండు రైళ్లు బయలు దేరుతున్నాయని బొత్స చెప్పారు.

Back to Top