<br/>హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దందాలు, సెటిల్ మెంట్లలో బిజీగా మారిపోయారని మాజీమంత్రి బొత్సా సత్యానారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజా మీద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునిసిపల్ కార్మికలు సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. భేషజాలకు పోకుండా వెంటనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని బొత్సా అన్నారు.