బూడిదపాడు వద్ద ముగిసిన 40వ రోజు పాదయాత్ర

బూడిదపాడు (పాలమూరు జిల్లా), 26 నవంబర్‌ 2012: షర్మిల చేస్తున్న పాదయాత్ర 40వ రోజు షెడ్యూల్‌ సోమవారం రాత్రికి ముగిసింది. షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల నియోజకవర్గంలోని బూడిదపాడుకు చేరుకోవడంతో నేటి కార్యక్రమం పూర్తయింది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, అవిశ్వాస తీర్మానం పెట్టి అధికారం నుంచి దించేయకుండా నిస్సిగ్గుగా దానికే మద్దతు నిలుస్తున్ ప్రధాన ప్రతిపక్షం టిడిపి, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తీరుకు నిరసనగా వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

సోమవారం ఉదయం బింగిదొడ్డి నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం షర్మిల తాటికుంట్ల క్రాస్‌, శేషంపల్లి క్రాస్‌రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగించారు. మధ్యాహ్నానికి మల్దకల్‌లో ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత షర్మిల శుద్దనూనెపల్లి, మీదుగా బూడిదపాడు చేరుకున్నారు. సోమవారంనాడు షర్మిల 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ రాత్రికి షర్మిల బూడిదపాడు వద్ద ఏర్పాటు చేసి బసలో విశ్రాంతి తీసుకుంటారు.

కాగా, సోమవారం రాత్రికి బూడిదపాడు చేరుకునే సమయానికి షర్మిల పాదయాత్ర 40 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకూ ఆమె మొత్తం 538.92 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు.

సోమవారం పాదయాత్రలో షర్మిల అంధబాలిక, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, వికలాంగులు, వృద్ధులు తదితరులతో మాట్లాడి వారి సమస్యలు స్యయంగా అడిగి తెలుసుకున్నారు. నేటి పాదయాత్రలో పలువురు టిడిపి నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీ నాయకులు షర్మిల సమక్షంలో వైయస్ఆర్ సిపిలో చేరారు.

Back to Top