వైఎస్ జగన్ దీక్షకు అంతా సిద్ధం..!

గుంటూరుః ఏపీకి ప్రత్యేకహోదా సాధనం కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకహోదాపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజలను మేలుకొలుపుతూ అహర్నిషలు శ్రమిస్తున్నారు. గుంటూరు వేదికగా వైఎస్ జగన్ చేపట్టనున్ననిరవధిక నిరాహార దీక్షకు సర్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 26 నుంచి గుంటూరులోని ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న ఉల్ఫ్ హాల్ గ్రౌండ్ లో జగన్ దీక్షకు పూనుకోనున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు దీక్షాస్థలి వద్ద పూజలు చేశారు. దీక్షను విజయవంతం చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తుగా తరలిరానున్న నేపథ్యంలో బారికేట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు బిజీ అయిపోయారు.

బొత్స సత్యనారాయణ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి కేంద్రరాష్ట్రప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఆర్.కె.రోజా
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మెడలు వంచైనా ప్రత్యేకహోదా సాధిస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే వరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. గుంటూరులో దీక్షాస్థలిని పరిశీలంచిన రోజా పరిశీలించిన రోజా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు కేంద్రం వద్ద సాగిలపడిపోయి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ప్రత్యేకహోదా కావాలని ఏపీ ప్రజలు కోరుతుంటే ప్రభుత్వం ప్యాకేజీ పాటపాడడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

అంబటి రాంబాబు
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎంత నిజాయితీపరుడో దేశానికి తెలిసిపోయిందని అంబటిరాంబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం వైఎస్ జగన్ చేపడుతున్న దీక్షకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు.

విశ్వేశ్వర్ రెడ్డి
ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్రానికి హోదా వచ్చే వరకు పోరాడుతామని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఉరవకొండలో వైఎస్ జగన్ దీక్షా పోస్టర్ ను విడుదల చేశారు. స్థానికంగా ర్యాలీలు, మానవహారాలు చేపట్టి ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తామన్నారు.

దేశాయ్ తిప్పారెడ్డి
ప్రత్యోకహోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి కోరారు. జగన్ దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే రిలీజ్ చేశారు.
Back to Top