వైయస్‌ జగన్‌ రావాలి
విశాఖ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అంతా మంచే జరిగిందని బెన్నవరం ప్రజలు పేర్కొంటున్నారు.  గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి కూడా తమ గ్రామంలో పాదయాత్ర చేశారని, ఇప్పుడు ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా మా ఊరికి రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావాలని, ఆయన ముఖ్యమంత్రి అయితే తండ్రి లాగే మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అడిగిన వెంటనే పింఛన్లు, ఇల్లు ఇచ్చారని, దేవుడిలా సాయం చేశారని గుర్తు చేశారు.  ఈ రోజు వైయస్‌ జగన్‌ వస్తే మాకు, మా పిల్లలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రోడ్లు కూడా వేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  
Back to Top