సీఎం మీడియా పిచ్చి వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట

ఏపీ అసెంబ్లీ: సీఎం చంద్రబాబుకు ఉన్న మీడియా పిచ్చి కారణంగానే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని, సర్కార్‌ వైఫల్యం వల్లే 28 మంది ప్రాణాలు కోల్పొయారని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ..గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ఒక గేటు మూయించారని, సీఎం మీడియా పిచ్చి వల్ల అనర్థం జరిగిందని ఆరోపించారు. షూటింగ్‌ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన 28 కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదని, బాధ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగ్గిరెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే పట్టుపట్టారు.

Back to Top