వైయస్‌ను సైతం జైలులో పెట్టేవారేమో!

తిమ్మాపురం

25 అక్టోబర్ 2012: జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి, కన్నుకుట్టిన అధికార, ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని షర్మిల విమర్శించారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా  అనంతపురం జిల్లా ఆత్మకూరులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇప్పుడు ఆయనను కూడా జైల్లో పెట్టేవారేమో అని ఆమె వ్యాఖ్యానించారు.
అపూర్వమైన తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన వైయస్ కుటుంబానికి వేధింపులు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ జనంలో ఉంటే తమ ఆటలు సాగవనే దురుద్దేశంతో జననేతను జైల్లో ఉంచేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుయుక్తులు పన్నుతున్నాయని ఆమె విమర్శించారు. మీరు ఆశీర్వదిస్తే రాజన్నరాజ్యం త్వరలోనే సాధ్యమని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డి పోయిన తర్వాత తమకన్నీ కష్టాలేనని వికలాంగులు షర్మిలతో తమ గోడు చెప్పుకుని వాపోయారు. షర్మిల ఎనిమిదవ రోజు పాదయాత్రకు 'అనంత'పల్లెల్లో ఘన స్వాగతం లభిస్తోంది. జనం బారులు తీరి నిలుచుంటున్నారు. షర్మిల పాదయాత్ర ఎనిమిదవ రోజు సుమారు 14 కి.మీల మేర సాగనుంది.

Back to Top