ఇదేనా బంగారు తెలంగాణ..?

హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని రాష్ట్ర వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణలోనే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన చెందారు. బంగారు తెలంగాణ సాధించడమంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్టంలోని రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనని పొంగులేటి అన్నారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ లను ముట్టడించింది. ఈక్రమంలోనే రైతులతో కలిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో రైతు సమస్యలపై ఆరు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. వెంటనే కరువు నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

Back to Top