బాబుకు కనువిప్పు కలిగేలా

మైదుకూరుః ఈనెల 29న కడప కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి వైయస్సార్సీపీ మహాధర్నా చేపట్టనుంది.  రాయలసీమ ప్రాంతంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు చంద్రబాబుకు పట్టడం లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలిగేలా ఈ ధర్నా చేపడుతున్నట్లు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో 150టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ నీటిని కేసీ కెనాల్, తెలుగుగంగకు విడుదల చేయడంలో ప్రభత్వం వెనుకంజ వేస్తుందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు కేసీ ఆయకట్టు కిందనే పంటను సాగుచేస్తున్నారని, నీరు ఉన్నా ఖరీఫ్‌ పంటకు పూర్తి స్థాయిలో అందిస్తారో లేదోనని రైతన్నలు భయపడుతున్నారు.

జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా జనవరి 15వ వరకు నీటిని అందిస్తామనే హమీని ఇవ్వాలన్నారు. చంద్రబాబు రాయలసీమ పట్ల కనీస చిత్తశుద్ది లేకకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జిల్లా పర్యటకు వచ్చినప్పుడల్లా తెలుగుగంగకు 12టీఎంసీల నీరు ఇస్తా, గండికోటకు నీరు అందిస్తామని చెప్పుతున్నాడే తప్ప చేయడం లేదన్నారు. 
Back to Top