ఎంపీ ప్రశ్నలకు బాబు స‌మాధానం చెప్పాలి

ప్రకాశంః తెలుగుదేశం పార్టీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌ని సంత‌నూత‌ల‌పాడు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ నియోజ‌క‌వ‌ర్గ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న పాల‌న‌పై ఎంపీ శివ‌ప్ర‌సాద్ వాస్త‌వాలు మాట్లాడార‌న్నారు. చంద్ర‌బాబు ఎస్సీల‌కు అన్యాయాలు చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ప‌రిపాల‌ను సొంత పార్టీ నేత‌లే ఈస‌డించుకుంటున్నారన్నారు. ఎంపీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌న్నారు.

Back to Top