ఉద్యమానికి తూట్లు పొడుస్తున్న బాబు

తిరుపతి : ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు ఆర్ కె రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరుపతిలో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని వారు స్పష్టం చేశారు. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా తిరుపతిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీ నేతలు దీక్షలు చేపట్టారు.

Back to Top