చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకో...అంబటి రాంబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసికి
వైకల్యం ముదిరిపోయిందనీ, అందుకనే తాను చేసిందే గొప్పది , దానినే అందరూ
గుర్తించాలనేట్లుగా ప్రవర్తిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి
రాంబాబు మండిపడ్డారు. అందుకనే తెలంగాణాలో టిఆర్ఎస్ గెలిస్తే , వైయస్ఆర్ కాంగ్రెస్
పార్టీ సంబరాలు చేసుకున్నదంటూ విమర్శలు చేస్తున్నారనీ, ఇలాంటి అర్ధరహితమైన
విమర్శలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం
నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ధోరణి ధోరణి ఆశ్చర్యకరంగా ఉందన్నారు. చంద్రబాబు
నాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన
చేసుకోవాలని హితవు పలికారు.

Back to Top