చంద్రబాబు రాజకీయ ఊసరవెల్లి..


ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు..దుర్మార్గమా..
అదే మాట ఏపీ ఎన్నికల ప్రచారంలో చెప్పగలవా..
తెలుగు రాష్ట్రాల్లోనే లోకేష్‌ పనికిరారు..
అందుకే తెలంగాణలో లోకేష్‌ను ప్రచారానికి పంపలేదు..
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెలే ఆర్కే రోజా..

విజయవాడః చంద్రబాబును చూసి  ఏపీ ప్రజలకు నవ్వాల్లో ఏడ్వాల్లో తెలియని పరిస్థితి ఏర్పడిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో  పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించండి అంటూ  చంద్రబాబు మతిస్థిమితంలేని  వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్న  చంద్రబాబు ఏపీ ఎన్నికల  ప్రచారంలో అదే మాట చెప్పగలరా అని ప్రశ్నించారు. 
ఏపీలో అయితే ఎమ్మెల్యేలు  నా అభివృద్ధి చూసి వచ్చారు. నా ముఖారవిందం చూసి  వచ్చారంటారని, తెలంగాణలో అయితే దుర్మార్గం, నీతిమాలి చర్య అంటారని  దుయ్యబట్టారు. అమ్ముడుబోయిన వారిది ఎంత తప్పో, కొన్న వారిది అదే తప్పు అని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేను డబ్బు,కాంట్రాక్టులు, మంత్రి పదవుల ఆశ చూపి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు పార్టీ  చిత్తుచిత్తుగా ఓడించాలా వద్దా అన్ని ప్రశ్నించారు.ౖ హెదరాబాద్‌ను  అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటున్నారని, అలాంటి హైదరాబాద్‌ నుంచి నిన్ను ఎందుకు తరిమితరిమి కొట్టారు అని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఎందుకు  నామరూపాలు లేకుండా పోయిందో సమాధానం చెప్పాలన్నారు. దేహీ అని ఎందుకు పొత్తులు పెట్టుకున్నావని ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేసీఆర్‌తో,మోదీతో కుమ్మక్కయారని చంద్రబాబు మాట్లాడటం సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందని ఎద్దేవా చేశారు. హరికృష్ణ శవాన్నిపెట్టుకుని టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం తాపత్రయ పడలేదా..  టీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు కాబట్టి నేడు కాంగ్రెస్‌తో అంటకాగడం నిజం కాదా అని అన్నారు.  ఎంఐఎం మోదీతో జతకలిసింది అని చంద్రబాబు వ్యాఖ్యనించడం చూస్తే ఎంత దారుణమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడో అర్థమవుతుందన్నారు. వినేవాడు ఎ్రరోడయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లు చంద్రబాబు తీరు ఉందని.. కాని తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు.తెలంగాణ ప్రజలు చంద్రబాబు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారన్నారు. చరిత్రలో ఏ స్పీకర్‌ చేయని విధంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కోడెల శివప్రసాద్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారన్నారు. ఎక్కడకు వెళ్ళి పచ్చకండువా వేసుకుని వెళ్తున్నారని విమర్శించారన్నారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన స్పీకర్‌ కోడెల గురించి పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించరని విమర్శించారు. మంత్రి పదువులు కట్టబెట్టిన చూస్తూ ఊరుకుంటారు తప్ప నోరు మోదపరన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సి స్పీకరే అసెంబ్లీలో సమాధి చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో  కోడెల శివప్రసాద్‌ వియ్యంకుడు ఇంటిలో జనసేన ఆఫీసు నడుస్తోందని పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపడం లేదా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు. 

దమ్ము,ధైర్యం గురించి తెలుసుకోవాలంటే సోనియాను, చంద్రబాబును అడగాలని పవన్‌కు చురకలు అట్టించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కితే మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలు మార్చివేస్తానంటే  ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు..బాలకృష్ణ అసెంబ్లీకి రారుగానీ, తెలంగాణలో ఉత్సాహంగా ప్రచారం చేస్తారని విమర్శించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను బాబు తుంగలో తొక్కినా చూస్తూ ఊరుకున్నారన్నారు. నందమూరి సుహాసిని తీసుకుని వచ్చి రాజకీయాలకు బలి చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు.. హరికృష్ణ కుటుంబం మీద ప్రేమ ఉంటే మీ కొడుకు లోకేష్‌కు ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పదవి  ఇచ్చి  మంత్రిని చేయవచ్చుకాదా అని అన్నారు. ఇప్పుటికైనా నందమూరి ఫ్యామిలీ కళ్లు తెరవాలని సూచించారు.

 ఏపీలోని సమస్యలను గాలికొదిలి ప్రత్యేక విమానాల్లో ప్రచారాలు చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రకు అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే నెత్తిమీద ఎక్కి కూర్చోండనే విషయంలో ఇప్పటికే కేసీఆర్‌కు అర్థమయ్యే ఉంటుందన్నారు. పట్టపగలు కెమెరా నుంచి దొరికిపోయిన చంద్రబాబును అయ్యో పాపం అని వదిలివస్తే నేడు నెత్తిన ఎక్కి ఆడుతున్నాడనే విషయాన్ని కేసీఆర్‌ గమనించాలన్నారు.చంద్రబాబు రాజకీయాల రంగులు మారుస్తున్నారని,  వ్యవస్థలను నీర్విర్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబును ప్రచారానికి వచ్చే ప్రతిచోట తరిమికొట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే లోకేష్‌ పనికిరారు. అందుకే తెలంగాణలో లోకేష్‌ను ప్రచారానికి పంపలేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top