హోదా విషయంలో మోడీ, బాబు ఇద్దరూ వంచన చేశారు


విశాఖపట్టణం : నరేంద్ర మోడీ ,చంద్రబాబులు కలసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వంచన చేసారని లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన రెడ్డి మండిపడ్డారు.హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టిడిపి, బిజెపిలు చేసిన వంచనకు వ్యతిరేకంగా  విశాఖపట్టణంలో చేపట్టిన వంచన దీక్షలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో  దేశవ్యాప్తంగా నరేంద్రమోదికి మంచి మెజారిటి ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో నూతనంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రాన్నివంచన చేసారన్నారు. ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తానని మోది అంటే కాదు పదిహేనేళ్లు తెస్తానని చంద్రబాబు వాగ్దానం చేసారు. కానీ వారిద్దరూ రాష్ట్రప్రజలను మోసం చేశారు.డిల్లీ కంటే మించిన రాజధాని ఇస్తానని చెప్పి నరేంద్రమోది మాటతప్పారు.చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి కావాలని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును కాలరాశారని మేకపాటి అన్నారు.ఈ పరిస్దితులలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు నడుం బిగించింది  జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే అని అన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మండుటెండల్లో 1900 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని ఇంకా కొనసాగిస్తున్నారన్నారు.ఆయనపై 12 అక్రమ కేసులు బనాయించినా కూడా పోరాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగలిగే సత్తా జగన్‌ కే ఉంది.చంద్రబాబు వంచనకు మారుపేరుగా ఉన్నారు.

చంద్రబాబు అంటే వంచన,హీనాతిహీనమైనమనిషి అంటే ఆయన అనిపిస్తోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 25 మంది పార్లమెంట్‌ సభ్యులను ఇస్తే హోదా తేస్తామని అంటున్నారు.ఇప్పడు ఆయన పార్టీపై గెలిచిన వారు. ఫిరాయింపు దారులు 20 మంది ఉన్నప్పటికీ  ప్రజలను మోసం చేసారు.మరోసారి మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్నికలలో 600 వాగ్దానాలు చేసి ఒక్కటి అమలుచేయలేదనీ. రైతులను, డ్వాక్రామహిళలను, నిరుద్యోగులను అందర్ని మోసం చేశారని,అనుభవజ్ఞుడివి అని చెప్పి గెలిపిస్తే అందరిని వంచన చేశారన్నారు. చరిత్రహీనుడిగా మిగిలిపోయారని మండిపడ్డారు. 

నైతిక విలువలకు పాతరేసిన చంద్రబాబును ప్రజలు ఏమాత్రం సహించరు .తిరుపతిలో తగుదునమ్మా అంటూ ధర్మదీక్ష పేరిట డ్రామా చేస్తున్నారు.  ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం జగన్‌ కు అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు.చంద్రబాబుకు బుద్ది వచ్చే విధంగా చేయాలన్నారు. మెడలి వంచి  ఇచ్చిన వాగ్దానాలను సాధించే పరిస్దితులు రాబోతున్నాయి అని పేర్కొన్నారు.
Back to Top